TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎవరూ గుర్తించడం లేదని రాహుల్ గాంధీని నిందించడాన్ని అలవాటుగా మార్చుకున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నారేమో అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పెడితేనే ఓర్వడం లేదని సీతక్క మండిపడ్డారు. రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.