AP: రాజధాని అమరావతిలో జోరుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తుళ్లూరు సమీపంలో GAD టవర్-1 నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. అన్నీ ఒకేచోట కొలువుదీరేలా నిర్మాణం ఉంటుందన్నారు. 2028 నాటికి అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధుల నివాసాలకు వాటర్ కనెక్షన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.