TG: హైదరాబాద్ నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపాలని నిర్ణయించినట్లు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. మూసీ ప్రక్షాళనకు మొత్తం 45 ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని, విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరినట్లు పేర్కొన్నారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు.