AKP: కోటవురట్ల కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరితాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.