ప.గో: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను భీమవరంలో సోమవారం కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారి గుడి దగ్గర ఉన్న పొట్టి శ్రీ రాములు విగ్రహానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, భీమవరం ఇంచార్జి తోట సీతారామలక్ష్మి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.