SKLM: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. ఆయన చేసిన ప్రాణత్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే పునాది అని అన్నారు.