GNTR: పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125 జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.