KRNL: నగరంలోని ఏ క్యాంప్ ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.