సత్యసాయి: గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నరేష్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి తనయుడు బీకే సాయి కళ్యాణ్ ఇవాళ మల్లాపల్లి గ్రామానికి చేరుకుని నరేష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.