AP: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. స్పర్శ దర్శనంపై పరిమితులు విధించారు.