సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. భక్తులు గంగిరేణు చెట్టువద్ద ముడుపులు, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.