ASR: గడువోకుర్తి పంచాయతీ గొబ్బిలమడుగులో పశువుల మృతి రైతులను కలవరపెడుతోంది. వరుసగా రెండు పశువులు చనిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిండుచూలు ఆవుతో సహా రెండు పశువులు మృతి చెందాయి. పశువులు నోటి నుంచి చొంగలు కార్చుకుంటూ అకస్మాత్తుగా చనిపోతున్నాయని రైతులు బుజ్జిబాబు, చిన్నబ్బాయి చెబుతున్నారు.