CTR: నగరి పరిధిలోని నత్తం కండ్రిగ దళితవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా పట్టా లేకుండా ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారి సమస్యలను పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజలకు ఇల్లు పెట్టాల పంపిణీ చేశారు.