TG: సినీ ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టులు 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని పేర్కొన్నారు. టెస్టు చేయించుకున్నాకే సినిమాలు రిలీజ్ కావాలని సూచించారు. పొలిటీషియన్స్ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, లేదంటే ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రావొద్దన్నారు.