బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. తాజాగా ఈ మూవీ టైటిల్ను మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మాతృభూమి’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక 2020 జూన్లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన భీకర ఘర్షణల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది.