AKP: నర్సీపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆయుష్మాన్ వాసవి క్లబ్, సుఖీభవ వాసవి క్లబ్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని రీజనల్ చైర్మన్ శిరం లక్ష్మణ్ రావు, జోన్ చైర్మన్ కనకరాజు అన్నారు.