AP: ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన బీజం వేశారని తెలిపారు. ’58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటైంది. ఆయన త్యాగానికి గుర్తుగా అమరజీవి జలధార అని పేరు పెట్టాం. ప్రతి ఆంధ్రుడు అమరజీవి త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి’ అని పవన్ వెల్లడించారు.