VKB: నర్సాపూర్ రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా తయారై ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. రోడ్డుపై కంకర తేలి, పెద్ద పెద్ద గుంతలు పడటంతో వాహనదారులు ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంతలు సరిగ్గా కనిపించక పలువురు వాహనదారులు అదుపుతప్పి పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాని కోరుతున్నారు.