KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో సత్యవతిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో పద్మజకు వినతిపత్రం అందజేశారు. ముదిగొండ మండలం వల్లభి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందగా.. అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.