GNTR: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నషీర్, పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. అనంతరం తుళ్లూరులో జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు.