WGL: ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ వేదికగా ‘సెక్యూరిటీ అండ్ ప్రైవసీ’ (ICSP 2026) అంశంపై 5వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. డిజిటల్ యుగంలో సమాచార భద్రత, గోప్యతలో ఎదురవుతున్న సవాళ్లు, సైబర్ థ్రెట్స్పై ప్రపంచవ్యాప్త పరిశోధకులు, నిపుణులు చర్చించనున్నారు.