NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ప్రజలు గండేపల్లి వెళ్లే రోడ్డులో ధర్నాకు దిగారు. సేంటిని ఫ్యాక్టరీ నుంచి వందలాది భారీ వాహనాలు ప్రయాణించటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రోడ్లు పాడవుతున్నాయని, దుమ్మి ధూళితో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. ఫ్యాక్టరీ వాహనాల కోసం ప్రత్యేక రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.