GDWL: ఆర్టిజన్ కార్మికులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులకు వారు మద్దతు ప్రకటించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందన్నారు.