NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం పోలీస్ అధికారులు గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅధితిగా డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సమాజం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని డీసీపీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత, గ్రామస్తులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.