TG: తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని, వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మోత్కూర్లో మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, శ్వేతలకు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి అయిలమ్మ వారసురాలు శ్వేతలను కమిషన్లో నియమించడం ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు.