AP: వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. వెలిగొండ టన్నెల్-2లో మిగిలిన బెంచింగ్ పనులను, తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్, డైవర్షన్ రోడ్డు పనులను జూన్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. 20 నెలల్లో క్లిష్టమైన 5.2KM లైనింగ్ పనులను పూర్తి చేసి, సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.