MLG: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కుమ్రం నాగోరావు పిలుపునిచ్చారు. ఏటూరునాగారంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుకు హానికరమని అన్నారు. పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, వివాహ నిర్వాహకులు సామాజిక బాధ్యతతో బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు.