విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER)లోని 49 ప్రాజెక్టుల అమలుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో VMRDA, జీవీఎంసీ, టూరిజం, రెవెన్యూ, ఐటీ కన్సల్టెంట్స్తో చర్చించారు. జూన్ 2న సీఎం చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.