BDK: జిల్లాలో శుక్రవారం కూడా ఎండల తీవ్రత కొనసాగింది. చుంచుపల్లి మండలం గారిమెళ్లపాడులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దుమ్ముగూడెం, ఇల్లందు, భద్రాచలం, టేకులపల్లి ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.