HYD: రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డ్” రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్, పెన్షన్, మహాలక్ష్మి పథకాలు, జనన, మరణ ధృవీకరణలు, ఆరోగ్య ప్రొఫైల్ను దీనికి అనుసంధానించాలన్నారు.