MNCL: విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే చదువు, క్రీడల్లో అంతగా రాణించగలరని బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గోలేటి ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మొబైల్ కు దూరంగా ఉంటూ, క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.