KDP: జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో గురువారం గాలివానతో కూడిన వడగండ్ల వాన తీవ్రనష్టం కలిగించింది. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పుల రేకులు గాలికి ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చేనేత కుటుంబాలు నిత్యవసర సరుకులు సైతం కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.