కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో రూ. 6.30 లక్షల వ్యయంతో నిర్మించిన వెటర్నరీ హాస్పటల్‌ను కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా తమ వద్దకు రావాలని, వాటిని పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.