HYD: అనకాపల్లి ఎంపీ రమేష్ శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల అంశాలపై చర్చించారు. ప్రాంత అభివృద్ధికి అవసరమైన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.