AP: పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. ఆగస్టులో ఎడమ ప్రధాన కాలువలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదే అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను మంత్రి నిమ్మల హెచ్చరించారు.