అన్నమయ్య: జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించాలని సూచించారు. వర్షాకాలానికి ముందే పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.