యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనిల్కుమార్ జంటగా ‘రోమాంచకం’ అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భద్రకాళి పిక్చర్స్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.