ATP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాకు 50 ఈ-బస్సులు కేటాయించారు. ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, 2026 చివరి నాటికి ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.