PDPL: వడదెబ్బతో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దబ్బేట రాజమ్మ (75) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాజమ్మ మృతి చెందినట్లు వారు తెలిపారు