వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ ముగించే పనిలో ఉన్నాడు. దీని తర్వాత ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ యాదు వంశీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ క్రీడా చిత్రంలో వరుణ్ వాలీబాల్ ప్లేయర్గా కనిపిస్తాడని సమాచారం. నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట.