చికెన్ ధర ఆకాశాన్నంటుతోంది. కిలో రూ.300 దాటింది. వేసవికాలం కావడం.. ప్రస్తుత సీజన్లో శుభాకార్యాలు ఎక్కువగా ఉండడం, రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఆదివారం రూ.250 ఉన్న కిలో చికెన్.. ఇప్పుడు రూ.300లకు చేరింది. ధరల పెరుగుదలతో వ్యాపారం తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు.