ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పంచామృత, ఏకవార రుద్రాభిషేకము చేపట్టి, రుద్రాక్ష మాలధారలతో విశేషంగా అలంకరించి, మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.