VKB: కొడంగల్ మండలం అంగడి రైచూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నిర్వహించనున్న ఈ ఉత్సవాల కోసం స్థానిక అంజన్న ఆలయాన్ని రంగులతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ధర్మపూర్ భజరంగ్ దళ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు.