CTR: చిత్తూరు ఎన్.పి.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నూతనంగా నిర్మించిన ఎన్.పి.చెంగల్రాయ నాయుడు బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, డా. కలికిరి మురళీమోహన్, లెక్చరర్లు పాల్గొన్నారు.