MDK: ప్రజల భద్రత దృష్ట్యా మెదక్ డివిజన్ పరిధిలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు రాత్రి 11 గంటలలోపు తప్పనిసరిగా మూసివేయాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. 11 గంటల తరువాత పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.