న్యూయార్క్లో జరిగిన హాఫ్ మారథాన్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ సత్తా చాటాడు. ఈ పోటీలో అతడు మూడో స్థానం సాధించాడు. 27 ఏళ్ల గుల్వీర్ 59 నిమిషాల 42 సెకన్లలో 21.1 కి.మీ. పరుగు పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ వైల్డ్షూట్, అమెరికాకు చెందిన జుహైర్ తల్బి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.