AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఈరోజు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు ఇటీవల విచారణలో గుర్తించారు. ఆమెపై రాజమండ్రి కోర్టు జారీచేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కొట్టేయాలని లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె సిట్ ముందుకు రానున్నారు.