JGL: సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని టీఆర్టీఎఫ్ నాయకులు రాయికల్ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంతకు పూర్వం జరిగిన ఎన్నికల విధుల్లో కొంతమంది ఉపాధ్యాయులకు మూడు దశల్లో డ్యూటీలు పడగా, కొందరికి అసలే పడలేదని పేర్కొన్నారు. జనగణన విధులు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.