HNK: బడ్జెట్లో విద్యాశాఖకు 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ వరంగల్ విభాగ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ అన్నారు. బాలసముద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థి, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.