VZM: బొబ్బిలిలో పారాది వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన, ఆర్అండ్ బి అధికారులకు ఆదేశించారు. ఇవాళ బొబ్బిలి కోటలో నిర్వహించిన సమీక్షలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేగవతి వంతెన పనులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.